1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (09:03 IST)

ఐదు రాష్ట్రాల భవితవ్యం ఏంటి? ఏయే పార్టీల మధ్య పోటీ?

ఐదు రాష్ట్రాల భవితవ్యం నేడు తేలనుంది. నేడు ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేయగా.. ఈ విధుల్లో సుమారు 50 వేల మంది పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. 
 
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు వుండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదల్-బీఎస్పీ కూటమి ప్రధానంగా పోటీ పడ్డాయి. మాజీ సీఎం అమరీందర్‌కు చెందిన జనలోక్ కాంగ్రెస్‌తో బీజేపీ జట్టుకట్టి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.
  
ఇక, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీలే హోరాహోరీగా తలపడ్డాయి. మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ కూటమితో కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ వుంది. 
 
గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, టీఎంసీలు పోటీపడ్డాయి.