సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (15:24 IST)

నెట్టింట వైరల్ అవుతున్న #SalaarEuphoriaIn250Days

Salar latest Poster
నెట్టింట #SalaarEuphoriaIn250Days అనే హ్యాష్ ట్యాక్ వైరల్ అవుతోంది. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం ఇప్పటికే 90 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ యేడాది సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో #SalaarEuphoriaIn250Days అనే హ్యాష్ ట్యాగ్‌తో చిత్రం అప్‌డేట్‌ను చిత్రం బృందం వెల్లడించింది. ఇంకేముంది.. కొన్ని గంటల వ్యవధిలో #SalaarEuphoriaIn250Days అే హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అయింది. ఫ్యాన్స్ రీట్వీట్లు, కామెంట్స్‌తో ట్రెండ్ అవుతోంది.
 
ఇప్పటికే దాదాపు 90శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే సెప్టెంబరు నెల 28వ తేదీన విడుదల కానుంది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగినట్టుగానే ప్రభాస్ స్టిల్స్ అధిరిపోయేలా ఉన్నాయి. అయితే, ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే మరో ఎనిమిది నెలలు ఆగాల్సిందే.