మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (09:12 IST)

ఏడుపు ఆపుకోలేక పోయిన బాలకృష్ణ

balakrishna, prabhas
balakrishna, prabhas
తన కుటుంబంలో సభ్యులు మరణిస్తే సహజంగా ఏడుపు ఆపుకోలేకపోవడం జరుగుతుంది. కానీ తన కుటుంబానికి అవసరమైతే వ్యక్తి చనిపోయాడని తెలిసిన వ్యక్తి చనిపోతే మనసు చలిస్తుంది. అలా నందమూరి బాలకృష్ణకు జరిగింది. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మృతి వార్త తెలియగానే ఆయన అదే చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ‘నేను షూటింగ్‌ కోసం టర్కీలో ఉన్న సమయంలో నేను మిస్‌ అయ్యాను, వార్త తెలుసుకున్న నేను ఏడుపు ఆపుకోలేక పోయాను’’ అని అన్నారు.
 
గోపీచంద, ప్రభాస్‌లతో నందమూరి బాలకష్ణ అన్‌ స్టాపబుల్‌ ప్రోగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. పెద్దనాన్న తో ఉన్న అనుబంధం గురించి ప్రభాస్‌ను అడిగారు. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ, ‘‘నెలపాటు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ దశలో నేను ఆసుపత్రిలో ఉన్నాను, నిరంతరం వైద్యులతో టచ్‌లో ఉన్నాను. ఈరోజు మనం ఏమైనా ఉన్నాం అంటే, అది ఆయన వల్లే, ఆయనకు రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ ప్రారంభించి ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో చరిత్ర సష్టించారు. ఈరోజు మా కుటుంబం అంతా అతన్ని చాలా మిస్సవుతున్నారు’’ అని అన్నారు. ఆహా!లో జనవరి 6న ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ 2లో మరిన్ని వివరాలు చూడవచ్చు.