శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (17:20 IST)

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ ముందుగానే చేసేసిన బాలకృష్ణ

balakrishna new year cake
balakrishna new year cake
నందమూరి బాలకృష్ణ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ ముందుగానే చేసేశారు. డిసెంబర్‌ 31న సాయంత్రం తన తాజా సినిమా 108 సినిమా సెట్లో హ్యాపీ న్యూఇయర్‌ 2023 అంటూ డెకరేషన్‌ రాసి కేక్‌ను కట్‌ చేశారు. ఈరోజు అనగా డిసెంబర్‌ 31న ఫిలింసిటీలోని జైలు సెట్లో యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ కోరిక మేరకు త్వరగా షూట్‌ ముగియగానే వారితో కలిసి బాలకృష్ణ 2023కు స్వాగతం పలుకుతూ ఇలా ఫోజ్‌ ఇచ్చారు.
 
ఎన్‌బికె108 సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్‌ పాళ్ళు ఎక్కువగానే వుంటాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.