బాలయ్య అన్‌స్టాపబుల్ -2 వేదికపైకి ప్రభాస్... ఏమైనా మీరంతా ఓ ముఠానయ్యా...
సినీ నటుడు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్-2 షోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ షో ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయింది. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నలకు ప్రభాస్ సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, పెళ్లి చేసుకుంటావా లేదా అని బాలయ్య అని ప్రశ్నించారు.
దీనిపై ప్రభాస్ బదులిస్తూ.. పెళ్లి చేసుకుంటాను సార్.. రాసి పెట్టి ఉండాలి కదా అని చెప్పారు. మీఅమ్మకి చెప్పిన మాటలు ఇక్కడ చెప్పకయ్యా.. కొడుకు పెళ్లి చేసుకోవాలని, కోడలితో కలిసి తిరుగుతూ ఉంటే చూడాలని ఆమెకి ఉంటుంది కదా అని బాలయ్య అన్నారు. ప్రస్తుతం మా సిస్టర్ మా అమ్మతోనే ఉంటుంది. మా వదిన వాళ్లు ఆ పక్కనే ఉంటారు. ఇప్పటివకు ఎలా నడిచిపోతుంది అని ప్రభాస్ చెప్పారు.
గతంలో ఈ షోకు వచ్చిన శర్వానంద్‌ను పెళ్లి ఎపుడు చేసుకుంటావని ప్రశ్నిస్తే, ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటానని చెప్పారు. అందుకు స్పందిస్తూ, అలా అయితే సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాత చేసుకుంటానని నేను చెప్పాలేమో అంటూ నవ్వేశారు. దీనికి బాలయ్య.. ఏమైనా మీరంతా ఓ ముఠానయ్యా... అదృష్టవంతులు అంటూ వ్యాఖ్యానించారు.