శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (11:01 IST)

2023 ప్రభాస్ కు కలిసొస్తుందా.. వేణు స్వామి ఏమంటున్నారు.. కష్టాలు తప్పవా?

Prabhas-pooja hegde
ప్రముఖ జ్యోతిష్య వేణు స్వామి రెబల్ స్టార్ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ప్రభాస్ కు అంతగా కలిసిరాలేదని.. వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
ప్రభాస్ జాతకరీత్యా ఆయనది వృశ్చికరాశి. ప్రస్తుతానికి శని గురువు స్థానాలు మారడంతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వేణు స్వామి తెలిపారు. ఆయన అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ వేణు స్వామి పేర్కొన్నారు.
 
ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుందని ఈయన చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ జాతకాలను నమ్మరని.. జాతకాలను నమ్మకుండా చేసిన రాధేశ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యిందని చెప్పారు. ప్రభాస్ కు దేవుళ్లపై నమ్మకం లేదని.. అదే ఆయనకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.