1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (10:00 IST)

జేడీ చక్రవర్తిపై సినీ నటి రంభ సంచలన కామెంట్లు

rambha
తెలుగు నటుడు జేడీ చక్రవర్తిపై సినీ నటి రంభ సంచలన కామెంట్లు చేసింది. జేడీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా.. తన పెళ్లికి రాలేదని చెప్పుకొచ్చింది. తనకున్న అతికొద్ది మంది స్నేహితుల్లో జేడీ చక్రవర్తి ఒకరని.. అయితే ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేసే విషయంలో అబద్ధాలు కోరు అని ఆమె వెల్లడించింది. అయితే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న రంభ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తోంది. 
 
జేడీ చక్రవర్తి రంభ జంటకు మంచి క్రేజ్ ఉండేది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమాలో ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే క్రమంలో కోదండ రాముడు చిత్రంలో కూడా జేడీ చక్రవర్తి, రంభ కలిసి నటించారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.