ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (13:52 IST)

ప్రభుత్వంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు.. దెబ్బతీస్తారు : వైకాపా ఎమ్మెల్యే

rachamallu shivaprasad reddy
ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావం చూపించవచ్చని ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రామమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంపై టీచర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 
 
ముఖ్యంగా, పీఆర్సీ, జీతభత్యాల విషయంలో తమ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. అయితే, ప్రభుత్వంపై వారు అసంతృప్తిగా ఉన్నప్పటికీ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. 
 
వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మ గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పమని, లక్షల మంది ఉన్న విద్యార్థులు అనుకుంటే వారి తల్లిదండ్రులతో ఓట్లు వేయించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిపై పీఠంపై కూర్చోబెడతారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోస్యం చెప్పారు.