శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (13:40 IST)

ఐదో తరగతి నుంచి పీజీ విద్యార్హతతో ఉద్యోగ అవకాశాలు

andhrapradesh logo
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐదో తరగతి నుంచి పీజీ విద్యార్హతతో 53 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యార్హత, అనుభవం ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేసింది. ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా, పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్ అర్హతులుగా నిర్ణయించింది.
 
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష ఉండదని వారు చెప్పారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు పోస్టు ద్వారా ఈ నెల 31వ తేదీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
కాగా, వివిధ ఆస్పత్రుల్లో ఉన్న పోస్టులను ఖాళీల వివరాలను పరిశీలిస్తే, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్. పోస్టులను బట్టి ఐదో తరగతి, 10వ తరగతి, ఇంటర్, జీఎన్ఎం, డిగ్రీ బీఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ డిప్లొమా లేదా తత్సవా కోర్సుల్లో ఉత్తీర్ణత. 
 
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఉద్యోగ అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారుని వయసు 42 యేళ్లకు మించరాదు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 
 
ఎంపికైన అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి రూ.12 వేల నుంచి రూ.1,10,000 వరకు వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా, జిల్లా వైద్యాధికారి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.