బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (12:32 IST)

డల్లాస్ అభిమాని ముకేష్ కు కన్నీటి నివాళి : చిరంజీవి

Dallas Fan Mukesh
Dallas Fan Mukesh
డల్లాస్ లో స్థిరపడిన నా ప్రియమైన అభిమాని ముకేష్ ఇక లేడన్న వార్తను నేను జీర్ణించుకోలేక పోతున్నాను ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకరం.  ముకేష్ కుటుంభ్యులకు ఎదురైన ఈ విషాదాన్ని తలుచుకుంటుంటే మనసు కలచివేస్తుంది. నేను 2012 లో డల్లాస్ వెళ్ళాను ,అప్పుడు నాకు ఘన స్వాగతం ఏర్పాటుచేసి, అద్భుత మైన గెట్ తో గెథెర్ ఏర్పాటు చేసిన వారిలో ముకేష్ ఒకరు. 
 
దృఢంగా ,ఉత్సహాంగా ఉండే ముకేష్ నాకు స్వాగతం పలకడమే కాకుండా, నన్ను ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా తీసుకువెళ్లిన CANA  (చిరంజీవి అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ) బృందంలో  కీలక వ్యక్తి అని నాకు తెలుసు.  ఆ రోజు నాకు CANA  చేసిన ఘన సత్కారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా ఫోటో తో Gold Coins ముద్రించిన బృందంలో ముకేశ్ ఒకరు. 
 
ఆ మధ్య రెండోసారి డల్లాస్ వెళ్ళినపుడు కూడా నాకు అదేవిధమైన సాదర  స్వాగతం లభించింది. ' మా ' అసోసియేషన్ తరపున  వెళ్లినా APTA & CANA  బృందం నన్ను వ్యక్తిగతంగా సత్కరించింది .
అందులో ముకేష్  ఉన్నారు . 
' ఆప్తా ' ' కానా ' ద్వారా ఎన్నో సేవా , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ  నన్ను ఆదర్శంగా తీసుకున్నామని వారు చెప్పినపుడు సంతోషంతో నా మనసు నిండిపోయింది .  కానీ, ఇంతలోనే ఈ వార్త వినడం నిజంగా బాధాకరం విధి బలీయమైనది. 
 
ఈ  కష్ట  సమయంలో ' ముకేష్ ' కుటుంబసభ్యులకు మనమందరం అండగా నిలబడాలి.  ముకేష్  శ్రీమతి గారికి  , పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను .  ముకేష్ దివ్య స్మృతికి నా కన్నీటి నివాళి  తెలుపూతూ  చిరంజీవి ప్రకటనలో తెలిపారు.