శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (16:43 IST)

టాప్‌ టెన్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌., డిజె.టిల్లు, కార్తికేయ2, మేజర్‌

charan, ntr
ఈ ఏడాది (2022) తెలుగు సినిమాల్లో మిశ్రమ ఫలితాలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ ఏడాది అంటే 2022లో స్ట్రెయిట్‌ చిత్రాలు, డబ్బింగ్‌ సినిమాలు కలిపి 282 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రెయిట్‌ సినిమాలు 211వరకు వున్నాయి. అందులో బాగా పాపులర్‌ అయింది పాన్‌ ఇండియా లెవల్‌లో పేరు ప్రఖ్యాతులు, నిర్మాతకు సొమ్ములు తెచ్చిపెట్టింది ఆర్‌.ఆర్‌.ఆర్‌., కార్తికేయ2, మేజర్‌ చిత్రాలు. ఇక మిగిలిన సినిమాలు టాప్‌ 10లో వుండి కలెక్షన్లు రావడం, యావరేజ్‌ సినిమాలుగా నిలవడం జరిగింది. అందులో డిసెంబర్‌ లో విడుదలైన రవితేజ ధమాకా నిదానంగా కలెక్షన్లతో నిర్మాతకు సేఫ్‌ సినిమాగా నిలిచింది. చిరంజీవి, నయనతార, సత్యదేవ్‌ సల్మాన్‌ ఖాన్‌ అతిధి పాత్రలో మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన గాడ్‌ ఫాదర్‌ చిత్రం విలువైన రీమేక్‌ అని నిరూపించబడిరది.
 
డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఒన్‌మేన్‌ ఆర్మీగా నటించిన  సన్  ఆఫ్  ఇండియా సినిమా అబాసుపాలైంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘రాథేశ్యామ్‌’ కాన్సెప్ట్‌ ప్రేక్షకులకు నచ్చలేదు. మేలో మహేస్‌బాబు నటించిన సర్కారువారి పాట విడుదలైనా కాన్సెప్ట్‌కంటే పాటలు పాపులరయ్యాయి. మసూద సినిమా హిట్‌ టాక్‌ వచ్చింది. కానీ భారీ బడ్జెట్‌ వల్ల అనుకున్నంత రాబట్టలేకపోయింది. హిట్‌2 సింపుల్‌ కథతో తీసిన ఈ సినిమా మరోసారి అడవిశేష్‌కు మంచి ఎటెంప్ట్‌గా పేరు తెచ్చిపెట్టింది. సుధీర్‌ బాబు, కతి శెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మంచు విష్ణు  జిన్నా సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక మిగిలిన సినిమాలు విడుదలైన కొద్దిరోజుల్లోనే నిరాశపరిచాయనే చెప్పాలి. 
 
ఈసారి బాలకృష్ణ సినిమా విడుదలే లేదు. విశ్వక్‌సేన్‌ డిజెటిల్లు మాస్‌ కలెక్షన్లు రాబట్టుకుంది. వెంటటేష్‌ నటించిన ఓరిదేవుడా పెద్దగా ఫలితం రాలేదు. ఎఫ్‌3 సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదనే చెప్పాలి. రానా నటించిన విరాట పర్వం కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. మొత్తంగా చూస్తే కార్తికేయ 2 చిత్రం ఇప్పటి యూత్‌ను మేథావుల్ని సైతం అబ్చురపరిచేలా వుంది. ఆ స్థాయిలో మిగిలిన సినిమాలు లేకవడానికి కారణం మేకింగ్‌, కథాంశంలో కొత్తదనం లేకపోవడమే. ఎక్కువగా టాప్‌ హీరోలు అనే భేదం లేకుండా చిన్న సినిమాలు  సరికొత్తగా వున్న కథ, కథనాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈఏడాది చివరిలో విడుదలైన నిఖిల్‌ ‘18 పేజెస్‌’ ఓకే సినిమాగా నిలిచిందికానీ భారీ లాభాలు రాలేదనే చెప్పాలి. పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్‌ సీరియస్‌ యాక్షన్‌ సినిమాగా సాగింది. కానీ కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్‌ కాలేదు.  ఇక ఈ ఏడాది టాప్ 10  సినిమాలను పరిశీలిద్దాం.
 
yashoda-samantha
yashoda-samantha
సామాజిక అంశంగా యశోద
సమాజంలో జరుగుతున్న సరోగసి పద్ధతిలో జరిగే మోసాలను వేలెత్తి చూపిన సినిమా ‘యశోధ’. సమంతా రూత్‌ ప్రభు, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ నటించిన ఈ సినిమాను హరీష్‌, నారాయణ అనే ఇద్దరు తమిళదర్శకులు  దర్శకత్వం వహించారు. ఇది సమంత అనారోగ్యం పాలైన తర్వాత విడుదలైంది. ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆదిత్య 369 వంటి సినిమాను తీసిన నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌ సినిమాగా నిలిచింది.
 
బింబిసార సేఫ్‌ చితర్రగా నిలచింది. 
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ పురాతన రాజు బింబిసారగా ప్రముఖ నటీనటులతో పాటుగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన నూతన దర్శకుడు మల్లిడి వశిస్ట్‌ రచించి, దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్‌ చిత్రమిది.  బింబిసార, దాని గొప్పతనం, పవర్‌-ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌, పురాణ నేపథ్య స్కోర్‌ అద్భుతంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. విజువల్స్‌. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ రన్‌ అవే హిట్‌ అయితే సెకండ్‌ హాఫ్‌ ఇంకాస్త బాగుండేది. పెట్టిన పెట్టుబడి వచ్చేసింది.
 
seetaramam
seetaramam
సీతా రామంతో విజయం పొందిన అశ్విన్ దత్ 
 సీతా రామం సినిమాతో చాలా కాలం గేప్‌ తర్వాత నిర్మాత సి. అశ్వనీదత్‌కు సక్సెస్‌ లభించింది. ఎప్పటినుంచో ఇలాంటి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు సీతారామం రూపంలో దక్కింది. దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న, సుమంత్‌  తమ పాత్రలకు ప్రాణం పోశారు, పాన్‌ ఇండియా లేవలో పేరు తెచ్చుకోవడమేకాకుండా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కథలోని మలుపులు ఆకట్టుకున్నాయి. 
 
adavi sesh
adavi sesh
మేజర్‌ గుర్తింపు  
అడివి శేష్‌, శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ నటించిన  మేజర్‌ వాస్తవ కథ.  అడివి శేష్‌ ఎమోషనల్‌ రాబోయే కథను చెప్పడానికి ఎంచుకున్నారు. ఆడియన్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా చేసింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది.
 
రాజమౌళి మరోసారి తన బ్రాండ్‌
ఇక ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి తెలిసిందే. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అజయ్‌ దేవగన్‌, అలియా భట్‌, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడీ, సముద్రఖని నటించిన యాక్షన్‌ ప్యాక్డ్‌ డ్రామా కోసం ప్రేక్షకులు క్యూకట్టారు. ఆ తర్వాత విదేశాల్లో అవార్డులకోసం లైన్‌ కట్టింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కథల్ని కల్పితంగా తీసి రాజమౌళి మరోసారి తన బ్రాండ్‌ నిరూపించుకున్నాడు. జపాన్‌ పర్యటనలో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వుందని ప్రకటించాడు.
 
సేనాపతికి లాభాలు 
రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాకేందు మౌళి నటించిన సేనాపతి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఓటీటీలో కూడా విడుదలై నిర్మాతకు సేఫ్‌ సినిమాగా నిలిచింది. 
 
చిన్న సినిమాల్లో మసూదా 
చిన్న సినిమాల్లో మసూదా సక్సెస్‌ సాధించింది. సంగీత, తిరువీర్‌, కావ్య కళ్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాష్‌ నటించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు సాయి కిరణ్‌ బాగా డీల్‌ చేశాడు. కానీ నిర్మాత యాదవ్‌కు ఎక్కువ బడ్జెట్‌, కరోనా టైంలో షూట్‌ వల్ల బడ్జెట్‌ ఎక్కువయి సక్సెస్‌ అయినా లాభాలు రాలేదు. మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది.
 
ఊర్వశివో రాక్షసివో
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌ నటించిన ఈ సినిమాకు రాకేష్‌ శశి దర్శకత్వం వహించాడు. చాలా కాలం తర్వాత సేఫ్‌ సినిమాగా అల్లు శిరీష్‌కు పేరు వచ్చింది.  
 
dhamaka-kartikeya2
dhamaka-kartikeya2
కృష్ణ తత్వాతనికి పెద్ద పీట
 నిఖిల్‌ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస రెడ్డి నటించిన కార్తికేయ2కు ప్రేక్షకులు నీరాజాలు పలికారు. కృష్ణ తత్వాతనికి పెద్ద పీట వేసినా ఊహించని మలుపులతో పిల్లలనుంచి పెద్దలను ఆకట్టుకుని నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ విజయంతో దీనికి మూడో పార్ట్‌కూడా వుంటుందని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ప్రకటించడం విశేషం.
 
రవితేజ ధమాకా 
రవితేజ మరియు శ్రీలీల ప్రధాన పాత్రలో త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా నిజంగానే డబుల్‌ థమాకాగా మాస్‌ ప్రేక్షకుల ఆదరణతో ముందుకుసాగుతుంది. కథ, కథనాలు పెద్దగా కొత్తదనం లేకపోయినా రవితేజ నటనతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డైలాగ్‌లతో నిర్మాతకు సేఫ్‌ సినిమాగా నిలిచింది.