శనివారం, 25 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 22 డిశెంబరు 2022 (18:47 IST)

ఆస్కార్‌ షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన ఆర్ఆర్ఆర్ నాటు నాటు!

rrr naatu
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌ షార్ట్ లిస్ట్‌కు ఎంపికైంది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఈ క్రమంలోనే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్‌ గెలుచుకున్న "ఆర్ఆర్ఆర్" ఆస్కార్ దిశగా అడుగులేస్తోంది. 
 
ఇంకా ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నిలిచింది. ఆర్‌ఆర్ఆర్ మూవీ ఒక కేటగిరీలో ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చేరింది. ఆర్ఆర్ఆర్ కోసం ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్  "నాటు నాటు" బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. కాగా నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.