ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన ఘనత
ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విజువల్ వండర్ మూవీ ఆర్ఆర్ఆర్. కు అవార్డ్స్, అరుదైన ఘనతలు వస్తున్నారు. ఆ పరంపరలో నేడు ప్రఖ్యాతి చెందిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఐదు క్యాటగిరీల్లో నామినేట్ అయింది. ఈ విషయాన్ని ఎస్ ఎస్ రాజమౌళి టీం సోషల్ మీడియా షేర్ చేసింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ , బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, అలానే బెస్ట్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేషన్లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ పరంపరకు సినీ ప్రముఖులు యూనిట్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.
ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంతటి ఘనత వస్తున్నదని ఎవరూ ఊహించ లేదు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కతలు కల్పితంగా తీసిన ఆకట్టుకొనేలా ఉందని క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ దాదాపుగా రూ. 1150 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్ సహా అనేక దేశాల ఆడియన్స్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఫిలిం దక్కించుకుంది.