శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (17:23 IST)

సినిమా ఆడకపోతే నేను బయటకు కనిపించను : కిరణ్ అబ్బవరం

నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అరవింద్ గారి వద్ద ఉన్న క్రమశిక్షణ వల్లే ఖర్చు హద్దుల్లోనే ఉండగలిగింది. అదే మా టీం సక్సెస్ సీక్రెట్. మా టీం వల్లే ఇదంతా సాధ్యమైంది అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. 
 
అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా,  క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ "వినరో భాగ్యము విష్ణు కథ" థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
 
 బన్నీ వాసు మాట్లాడుతూ,  ఇప్పుడిప్పుడే కేజీయఫ్, విక్రమ్ వంటి ఫార్మాట్లకు అలవాటుపడుతున్నారు.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సినిమా తీయాలని కొత్తగా డైరెక్ట్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాం. చేతన్ భరద్వాజ్‌లో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇంతకు ముందు తెలియదు. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. మా ప్రతీ మాటను అర్థం చేసుకున్నారు. కిరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు.
 
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'సక్సెస్ మీట్‌లు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సినిమా ఆడకపోతే.. నేను బయటకు కనిపించను. ఆడియెన్స్‌ ఇచ్చే రిజల్ట్‌ను నేను గౌరవిస్తాను. ఇప్పటి వరకు నేను ఐదు సినిమాలు చేశాను. ఏ సినిమా గురించి కూడా ఇలా మీడియా వచ్చి మాట్లాడలేదు. ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే మాట నుంచి ఈ సినిమా మొదలవుతుంది. పిల్లలను ఎలా పెంచాలి.. ఎలాంటి మాటలు చెప్పాలి అని తెలియజేసేదే విష్ణు కథ. ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చాలా మంచి సినిమాను తీశాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. మంచి మాటలు వింటారు. దేశం గురించి చెప్పాం. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను చూసి ఇంత ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్' అని అన్నారు.
 
నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ,  వాసు సినిమాల్లో కథే హీరో. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. అందరికీ నమ్మకం ఉంటుంది. కొత్త డైరెక్టర్ వచ్చాడు.. కథ చెప్పాడు.. బాగుందని వాసు చెప్పినప్పుడే నేను ఈ సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. చాలా సినిమాలు సోమ,మంగళవారం వచ్చే సరికి బ్రేక్ అవుతాయి.. కానీ మా సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇలాంటి కథలను చిన్న స్క్రీన్ మీద, ఓటీటీల్లో చూడటం కంటే.. థియేటర్లో చూసినప్పుడు వచ్చే మజా వేరేలా ఉంటుంది. ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్‌ ఈ సినిమాను అద్భుతంగా తీశారు అని అన్నారు.