Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)
ఆన్‌లైన్ డెలివరీ స్కామ్‌లో ఓ వ్యక్తి రూ.1.86లక్షలు పోగొట్టుకున్నాడు. అక్టోబర్ 14న రూ.1,86,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనే ప్రీ-పెయిడ్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 19న అతనికి పార్సిల్ డెలివరీ అయ్యింది. ఇలాంటి ఖరీదైన వస్తువులు డెలివరీ అయినప్పుడు మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, కస్టమర్ తెలివిగా డెలివరీ బాక్స్‌ను తెరుస్తున్నప్పుడు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశాడు.
అయితే, బాక్స్‌ను తెరిచి, అందులోని ఫోన్ ఓపెన్ చేయగా... అందులో ఖరీదైన ఫోన్ ఉండాల్సిన చోట, ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది. ఇది చూసిన వినియోగదారుడు షాక్ అయ్యాడు. విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు ఒక టైల్ (పెంకు) ముక్క వచ్చింది.