బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (12:54 IST)

వినరో భాగ్యము విష్ణు కథ ఎలా ఉందంటే.. రివ్యూ

kiran abbvaram
kiran abbvaram
నటీనటులు: కిరణ్ అబ్బవరం, క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ, ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్, సంగీత దర్శకులు: చైతన్ భరద్వాజ్,  ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాత: బన్నీ వాస్, దర్శకుడు : మురళీ కిషోర్ అబ్బూరు
 
కిరణ్‌ అబ్బవరం హీరోగా నిలదొక్కుకోవాలనే తాపత్రయపడుతున్న నటుడు. సొంత నిర్మాణంలో సినిమాలు తీస్తూ కె.ఆర్. కళ్యాణమండపం అనే సినిమాతో ఓకే అనిపించుకున్న నటుడు. ఆ తర్వాత సమ్మతమే, సబాస్టియన్‌ సినిమాలు చేశాడు. కొత్త దర్శకులకు అవకాశాలిస్తున్న ఆయన ఈసారి కూడా అదేబాటలో సినిమా తీశాడు. అదే..వినరో భాగ్యము విష్ణు కథ  ఈరోజే విడుదలైంది. అల్లు అరవింద్‌, బన్నీవాసులు కూడా సినిమా ప్రమోషన్‌కు తోడుకావడంతో భారీ అంచనాలమధ్య విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తిరుపతిలో వుండే విష్ణు (కిరణ్‌ అబ్బరం) లైబ్రేరియన్‌. తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత (శుభలేక సుధాకర్‌) పర్యవేక్షణలో పెరుగుతాడు. ఊరిలోని ప్రజల ప్రవర్తనను గమనించి తోటివారికి ఏదైనా సాయం చేయాలనే కాన్పెస్ట్‌తో వుంటాడు. అలా తన ఫోన్‌ నెంబర్‌లో చివరి అక్షరంలో అటు ఇటూగా మార్చి మరొకరికి (నైబర్‌ నెంబర్‌ అని పెట్టుకున్నారు) ఫోన్‌ చేస్తాడు. అది య్యూట్యూబర్‌ దర్శన (కశ్మీర పరదేశి) ది.  ఇక మురళీ శర్మ పెట్‌ డాగ్‌ కేర్‌ టేకర్‌గా వుంటాడు. విష్ణు మొదటి చూపులోనే ప్రేమలో పడిన కశ్మీర్‌ ఓ సందర్భంగా మురళీశర్మను హత్య చేసి జైలుకు వెళుతుంది. మరోవైపు అనుకోకుండా ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్‌కు విష్ణు సినిమా కథ చెప్పాల్సివస్తుంది. ఆ తర్వాత ఏమయింది? కశ్మీర జైలుకు ఎందుకు వెళ్ళింది? ఆ తర్వాత కథే మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
 
మొదటి భాగం ఎంటర్ టైన్‌మెంట్‌గా సాగుతుంది. అనేక మలుపులతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. హీరో కిరణ్‌ ప్రతి సినిమాను కొత్త దర్శకులకు అవకాశం ఇస్తుంటాడు. అలాంటిదే సమ్మతమే, సబాస్టియన్‌. ఇప్పుడు ఇది. కొత్తవారు తనను నటుడిగా తీర్చిదిద్దుతారేమోనని అనుకుంటాడే ఏమో కానీ ఎన్ని కథలు చేసినా తన నటనలో పరిణతి ఇంకాస్త మెరుగదలపరిస్తే అద్భుతమైన నటుడిగా రాణిస్తాడు. నైబర్‌ నెంబర్‌ అనే కాన్సెప్ట్‌ కొత్తదే అయినా సినిమాటిక్‌గా సీన్లు చూపించాడు. టెర్రరిస్టు ముఠా రావడంతో కథ సీరియస్‌గా అనిపించినా అది కాస్త ప్రేమకథవైపు తీసుకెళ్ళాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో రొటీన్‌తోపాటు సిల్లీగా అనిపించే సన్నివేశాలుంటాయి. 
 
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కొత్త లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. హీరో- హీరోయిన్ మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. అసలు హీరోయిన్ క‌శ్మీరా ప‌ర్ధేశీ క్యారెక్టర్ చాలా సిల్లీగా ఉంటే.. మురళీ శర్మ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగింది.
 
చైతన్య భరద్వాజ సంగీతం బాగుంది. పాటలు, సినిమాటోగ్రఫీ పనితీరు బాగుంది. సంభాషణలు  బాగానే రాశాడు. కొత్త ఒరవడిగా క్రియేట్‌ చేసేలా వుంటుంది. ప్రవీణ్‌, శ్రీనివాస్‌ మిగిలినవారు బాగానే నటించారు. లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి. నిర్మాణవిలువలు ఉన్న ఈ సినిమాను కమర్షియల్‌గా ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.