బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (23:09 IST)

తన పెళ్లి గురించి, కొత్త చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చిన సాయిధరమ్‌ తేజ్‌

Sai tej
Sai tej
ఇటీవలే యాక్సిండెట్‌కు గురయి ప్రజల ఆశీస్సులతో బయటకు వచ్చిన సాయి దరమ్‌తేజ్‌ సినిమా ఫంక్షన్లకు రావడం లేదు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సాయితేజ్‌ ఈరోజు రాత్రి జరిగిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ట్రైలర్‌ లాంఛ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను ముఖ్యంగా మహిళా అభిమానులు, యూత్‌ పెండ్లి గురించి అడిగారు. వెంటనే సాయితేజ్‌ స్పందిస్తూ, కుర్రకారుని ఉద్దేశించి.. ముందు ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. అప్పుడు పెండ్లి చేసుకుంటా అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
 
అనంతరం ఓ మహిళ ప్రత్యేకించి మీపెండ్లికోసం వెయిటింగ్ సార్‌! అని అనడంతో.. వెంటనే.. పెండ్లి ఎప్పుడో అయిపోయింది. నాలుగు సార్లు పెండ్లయింది.. అంటూ సమాధానం ఇచ్చారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న సినిమా గురించి అడగగా.. విరూపాక్ష చిత్రం చేస్తున్నా. ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌లో విడుదలకు సిద్ధమవుతుంది అంటూ.. ముందు వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవుతుంది. దాన్ని సక్సెస్‌ చేయండని పిలుపు ఇచ్చారు.