ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (11:00 IST)

పుష్ప ది రూల్‌ కోసం కత్తులు, గంధం చెక్కలు రెడీ! తాజా న్యూస్

knief, dungalu
knief, dungalu
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప ది రూల్‌ కోసం చిత్ర సాంకేతిక వర్గం అన్ని ఏర్పాట్లు చేసింది. వైజాగ్‌ కింగ్‌ అంటూ అల్లు అర్జున్‌కు నిన్న ఘన స్వాగతం పలికారు. మారేడుమిల్లిలో జరిగే షూటింగ్‌కు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ను శనివారంనాడు తీస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పనిముట్లు కత్తులు, ఎర్రచందం దుంగలను తయారు చేయడానికి సాంకేతిక సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారు. కత్తులకు పదును పెడుతూ, వాటికి తగిన విధంగా రంగులు దిద్దుతూ సిబ్బంది కనిపించారు.
 
Errachndanam duplicate
Errachndanam duplicate
ఇక సినిమా కథకు కీలకమైన ఎర్రచందనం దుంగలు ఎలా తయారుచేస్తున్నారనేది కూడా అభిమానులకు చూపిస్తూ టెక్నికల్ టీమ్ పోస్ట్‌ చేసింది. బాగా తేలికైన మామూలు కలపను తీసుకుని వాటిని తగిన విధంగా కట్‌ చేసి వాటికి ఎర్రచందం ఉట్టిపడే రంగును కలుపుతూ ఫైనల్‌ రూపం తీసుకువచ్చి లారీలో పెట్టారు. వీటిని బిఫర్‌ ` ఆఫ్టర్‌ అంటూ చూపిస్తూన్న ఎర్రచందం దుంగలు ఆకట్టుకుంటున్నాయి. 
 
ఈరోజే షూట్‌లో జగపతిబాబు ప్రవేశించారు. ఆయనతో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను తీస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్‌, షాట్‌ టీజర్‌ను ఏప్రిల్‌ 8వ తేదీన బయటపెట్టనున్నట్లు చిత్ర యూనిట్‌ హింట్‌ ఇచ్చింది. ఫైనల్‌గా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి దర్శకుడు సుకుమార్‌ బ్లాక్‌ చేశారు. అంటే 2024 సంక్రాంతికి పుష్ప రూల్‌ చేయనున్నాడన్నమాట.