సౌత్ సినిమాలకూ మరాఠీ సినిమాకు అదే తేడా : కశ్మీర పరదేశి
మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన నర్తనశాల చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్ అబ్బవరంకు జోడీగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్ చేస్తూ ఇలా అన్నారు.
ఇక్కడ సినిమా కథలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే వుంటాయి. కొన్ని కంటెంట్ వున్నా కామెడీ జోడింపు తోపాటు కల్పితాలుగా చూపిస్తారు. అదే మరాఠీ సినిమాల్లోని కథలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. కంటెంట్ బేస్డ్ సినిమాలు. పొయటిక్‌గా వుంటాయి. పాటలు అర్థవంతంగా వుంటాయి. కొన్ని కామెడీ సినిమాలూ వుంటాయి. అయితే కమర్షియల్ కోణం చాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది.