ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (12:22 IST)

ప్రెగ్నెన్సీ పుకార్లపై స్పందించిన సింగర్ సునీత

Sunitha
2021లో వీరపనేని రామ్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత, ఆమె ప్రెగ్నెన్సీపై పుకార్లపై స్పందించింది. ఇప్పుడున్న ట్రెండ్‌లో సెలబ్రిటీల చుట్టూ పుకార్లు సర్వసాధారణమైపోయిందని చెప్పుకొచ్చింది. 
 
ప్రెగ్నెన్సీ పుకార్లపై ఎట్టకేలకు స్పందించిన సునీత.. ఈ పుకార్లకు తనకు, తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించిన వ్యక్తుల ఆలోచనా పరిపక్వతకు సంబంధించినవి చెప్పారు. 
 
దీంతో కొంతకాలంగా సాగుతున్న ప్రెగ్నెన్సీ పుకార్లకు తెరపడింది. ఆమె వాలెంటైన్స్ డే గురించి సునీత మాట్లాడుతూ.. వాలెంటైన్ డే అన్నీ రోజుల్లాగానే సాగిపోతుందని సింపుల్‌గా చెప్పేసింది. 
 
తన భర్త తన ఇంటికి పూలతో స్వాగతం పలకాలని తాను ఆశించడం లేదని సునీత పేర్కొంది. అయితే, ఆమె ఇంటికి పూల గుత్తిని తీసుకెళ్లాలని కోరుకుంటానని వెల్లడించింది.