బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (11:44 IST)

ఆస్ట్రేలియాలో సునీత కొత్త సంవత్సర వేడుకలు.. ఫోటోలు వైరల్

sunitha
టాలీవుడ్ సింగర్ సునీత తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. తన భర్త రామ్ వీరపనేనితో కలిసి సునీత కొత్త  సంవత్సర వేడుకలను ఆస్ట్రేలియాలో జరుపుకుంది. ప్రస్తుతం సునీత ఆస్ట్రేలియా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
మిరుమిట్లు గొలిపే వేడుకల మధ్య 2023 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు సునీత. ఈ మేరకు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇన్ స్టాలో ఆ మధుర క్షణాలను ఆస్వాదించారు. 
 
అలాగే సునీత తన పోస్ట్‌కి "హ్యాపీ మూమెంట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.