1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (09:21 IST)

భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి.. భర్త తీసుకోవడం నేరమే : ఢిల్లీ హైకోర్టు

gold
భార్య నగలపై ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఆ నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అంటూ వ్యాఖ్యానించింది. అలాంటి నగలను భర్త తీసుకోవడం నేరమేనని స్పష్టం చేసింది. అదేసమయంలో వివాహమైన మాత్రాన భార్యపై సర్వ హక్కులు ఉంటాయని భావించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
 
పైగా, భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని, భర్త అయినా వాటిపై కన్నేయడం నేరమేనని జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. 
 
భర్త తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకెళ్లడం చేయొద్దని ఆదేశించింది. కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందన్న కోర్టు... నిందితుడు అధికారులకు సహకరించడం లేదని, అపహరణకు గురైన నగలను తిరిగి ఇవ్వడం కాని జరగలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి పిటిషన్‌ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది.