1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (14:06 IST)

నా భర్తను చంపేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటా... ప్రియుడికి భార్య ఆఫర్

murder
ఏపీలోని కర్నూలు జిల్లాలో తన ప్రియుడికి ఓ మహిళ ఓ ఆఫర్ ఇచ్చింది. తన భర్తను చంపేస్తే నిన్న పెళ్లి చేసుకుంటానని, అపుడు హాయిగా కలిసి జీవించవచ్చని చెప్పింది. ఇదే మంచి ఆఫర్‌గా భావించిన ప్రియుడు.. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఆమె భర్తను చంపేశాడు. ఇపుడు వారిద్దరూ జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 
 
ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల ఆల్వాలలో జరిగిన ఆమోస్ హత్య కేసులో మర్మాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుని భార్యతో పాటు ఆమె ప్రియుడు ములకల సూర్య ప్రదీప్, అతని స్నేహితుడు జీవన్ కుమార్‌లు ప్రధాన సూత్రధారులుగా తేల్చి అరెస్టు చేశారు. 
 
ఆల్వాలకు చెందిన ఆమోస్‌, అరుణలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి జరిగినపుడు అరుణ మైనర్ కావడంతో ఆమోస్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
 
కర్నూలులోని సిటీ స్క్వేర్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగాను, అదే కాంప్లెక్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్ ఉమెన్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో అరుణకు ఇంటి సమీపంలో ఉండే సూర్య ప్రదీప్‌తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈయన స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భర్తను చంపేస్తే ఇద్దరం పెళ్లి చేసుకుని హాయిగా జీవించవచ్చని ప్రియుడికి చెప్పింది. దీంతో అతడు హత్యకు పథక రచన చేశాడు. 
 
తన స్నేహితుడు జీవన్ కుమార్‌తో ఈ నెల 22వ తేదీన ఆమోస్‌ను తీసుకుని హంద్రీ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ మద్యం సేవించి తన వెంట తెచ్చుకున్న ఫ్యాను రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో హంద్రీ నదిలో పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత తన ప్రియురాలికి ఫోన్ చేసి సూర్య ప్రదీప్ విషయం చేరవేశాడు. 
 
ఈ క్రమంలో హంద్రీ నదిలో ఓ శవం లభ్యం కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదేసమయంలో అరుణ కూడా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరుణను సందేహించి విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.