శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:35 IST)

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

pharma city fire
విశాఖపట్టణం అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ లారస్ ల్యాబ్స్‌‍లో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, అతని సమీపంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. 
 
పరిశ్రమ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మూడో యూనిట్‌లోని తయారీ విభాగం-6లో రియాక్టర్, డ్రయర్ల దగ్గర మధ్యాహ్నం 3.15 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రత రబ్బరుతో తయారు చేసిన ఉపకారణాలన్నీ కాలిపోయాయి. మంటలు తగ్గాగ సంఘటన స్థలాన్ని పరిశీలించగా, నలుగురు జీవన దహనమైన స్థితిలో ఒకరు తీవ్రంగా గాయలతో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. క్షతగాత్రుణ్ణి 4.20 గంటలకు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పతికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు (32), గుంటూరుకు చెందిన తలశిల రాజేశ్ బాబు (36), అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడకుచెందిన రాపేటి రామకృష్ణ (28), చోడవరం మండలం బెన్నవోలుక చెందిన మజ్జి వెంకట రావు (36) ప్రాణాలు కోల్కోల్పోయారు. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన యడ్ల సతీశ్ (36) మృత్యువుతో పోరాడుతూ ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారు.