బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (18:21 IST)

పార్లమెంటులో మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్

sasi tharoore
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌కు గాయమైంది. పార్లమెంటులో మెట్లు దిగుతూ జారి కిందపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. బుధవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సమావేశాలకు హాజరైన ఆయన... మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స చేశారు. కాలికి బ్యాండేచ్ వేయించుకుని తన నివాసానికే పరిమితమయ్యారు.
 
ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గ కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, థరూర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.