శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:05 IST)

నేడు బంగ్లాతో తొలి వన్డే మ్యాచ్ : షమీకి గాయం

shami
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే ఢాకాకు చేరుకుంది. ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియాలోని ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు కల్పించారు. 
 
షమీ భారత్‌లో ఉన్నపుడే ప్రాక్టీస్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. దీంతో అతను జట్టులోకి వెళ్లలేదు. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో చికిత్స తీసుకుంటున్న షమీ.. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ కారణంగా అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులోకి తీసుకున్నారు.