శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (08:48 IST)

గాయాలతో రోడ్డుపై గాయాలతో పడివున్న వ్యక్తి: చలించిన గవర్నర్

tamizhisai road accident
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన దయ చూపారు. ప్రమాదంలో గాయపడి రోడ్డుపై ఉన్న వ్యక్తని చూసిన ఆమె చలించిపోయారు. తన కాన్వాయ్‌ను ఆపి ఆ క్షతగాత్రుడికి సాయం అందించారు. స్వయంగా ఆమె ఒక వైద్యురాలు కావడంతో ఆ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత అతన్ని చెన్నై నగర శివారు ప్రాంతమైన కాట్టాన్‌‍కుళత్తూరు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ వ్యక్తి పుదుచ్చేరి నుంచి చెన్నైకి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను చూసి గవర్నర్ తమిళిసై కారును ఆపారు. ఆమె అతని గాయానికి చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆమె దయ చూపినందుకు స్థానికులు ఆమెను ప్రశంసించారు.