గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (10:51 IST)

రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట.. సీనియర్ నేత వేణుగోపాల్‌కు గాయాలు

kcvenugopal
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే పలు రాష్ట్రాల మీదుగా సాగిపోయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీని చూడటానికి ఇండోర్ వాసులు భారీగా తరలివచ్చారు. ఈ జనాలను పోలీసులు నియంత్రించలేకపోయారు. దీంతో స్వల్ప స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ కిందపడిపోవడంతో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు. దీంతో ఆయనను యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ హఠాత్పరిణామంపై వేణగోపాల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదారణను చూసిన బీజేపీ ఓర్చుకోలేక, తమ యాత్ర పరువు తీసేందుకు యత్నిస్తుందన్నారు. యాత్రకు పోలీసులు తగిన స్థాయిలో భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, దీనికి కారణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. యాత్ర సందర్భంగా రాహుల్ లేవనెత్తుతున్న బీజేపీ వైఫల్యాలను ప్రజలను అర్థం చేసుకుంటున్నారని, దీన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని తెలిపారు.