గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (15:45 IST)

బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.. ప్రధాని మోదీపై పిటిషన్

Modi
Modi
బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదలైన వీడియోలో ప్రధాని మోదీ పక్కన నిలబడిన ఓ బాలిక తన గుజరాతీ భాషలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మోదీని, బీజేపీని పొగిడిన అమ్మాయి మెడలో బీజేపీ లోగో ఉన్న దుపట్టా ఉంది.
 
రామ మందిరంతో పాటు పలు విషయాల గురించి ఆ బాలిక మాట్లాడుతుండటం ప్రధాని మోదీ పక్కనే కూర్చుని వింటున్నారు. ఆ తర్వాత ఆ బాలిక ధరించిన దుపట్టాపై సంతకం చేసి బాలికను అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బాలికను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన సుప్రియ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.