శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 నవంబరు 2022 (19:48 IST)

ఐబీసీ కాంటినమ్‌, వెబ్‌ 3.0 ఆల్ట్‌ హ్యాక్‌ను టీ-హబ్‌ వద్ద ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్

image
ఐబీసీ మీడియా నేడు ఐబీసీ కాంటినమ్‌ వెబ్‌ 3.0 హ్యాక్‌ఫెస్ట్‌ ఛాలెంజ్‌ను భారతదేశ వ్యాప్తంగా ప్రొఫెషల్స్‌ మరియు విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని టీ-హబ్‌ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర ఐటీఈ అండ్‌ ఎస్‌ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌ ఈ కార్యక్రమాన్ని టాస్క్‌ సీఈఓ శ్రీ శ్రీకాంత్‌ సిన్హా; టీృహబ్‌ సీఈఓ శ్రీ  శ్రీనివాసరావు మహంకాళి మరియు ఐబీసీ మీడియా ఫౌండర్‌-సీఈఓ శ్రీ అభిషేక్‌ పిట్టీ సమక్షంలో ప్రారంభించారు.
 
ఉమ్మడి నిర్వహణ బృందంలో, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమ పార్టిస్పెంట్స్‌, ఐబీసీమీడియా ఉన్నారు. ఇదే సందర్భంలో ఐబీసీ యొక్క ఎజెండాకు హెడ్‌లైన్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న పోల్కాడాట్‌ మద్దతుతో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌ చైన్‌ కాంగ్రెస్‌  ఐబీసీ 2.0  రెండవ ఎడిషన్‌ కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ సంవత్సరపు సదస్సును ఐబీసీ 2022-23కాంటినమ్‌ నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి మరియు ఆసియాలో అతిపెద్ద బ్లాక్‌చైన్‌ సదస్సును నిర్వహించిన గౌరవాన్ని హైదరాబాద్‌ అందుకుంది. ఈ సదస్సును 2018లో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌చైన్‌  కాంగ్రెస్‌ (ఐబీసీ) నిర్వహించింది. రెండవ ఎడిషన్‌ 2022-23 కాంటినమ్‌ను అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన స్పీకర్లుతో  సమాచార యుక్త మరియు అనుసంధానిత సదస్సులు,నెట్‌వర్కింగ్‌ అవకాశాలతో పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ మేథావులను కలుసుకునే అవకాశం, భారతదేశ వ్యాప్తంగా డెవలపర్‌ మరియు విద్యార్ధి కమ్యూనిటీల కోసం 2018లో తెరువబడిన  నూతన మార్గాలను నిర్మించుకునే అవకాశాలు నిర్మించుకోవడం కొనసాగించవచ్చు.
 
ఐబీసీ 2022-23లో మార్గదర్శక కార్యక్రమాలలో ఒకటిగా  ఐబీసీ ఎడ్యుకేషన్‌ మరియు సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐబీసీ టెక్‌ వయోజ్‌) నిలుస్తుంది. దీనిని ప్రత్యేకంగా వెబ్‌ 2.0 సామర్ధ్యంల నుంచి ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీ వెబ్‌ 3.0 ఇండస్ట్రీ రెడీ డెవలపర్స్‌గా మారడానికి ఇది తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం సమగ్రమైన, ఫుల్‌ సైకిల్‌ ఎజెండాతో  ఉంది. దీనిలో ఓరియెంటేషన్‌, అగ్రగామి బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3.0 నిపుణులతో విద్య, అనుసరించి శిక్షణ, మేధోమధన సదస్సులు, అగ్రగామి మెంటార్ల మార్గనిర్దేశకత్వంలో స్పీడ్‌  బల్డింగ్‌ చేయడం, విజేతల వెల్లడి కార్యక్రమాలు ఉంటాయి.
 
ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, బూట్‌క్యాంప్‌లు, హ్యాకథాన్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను అందించడం ద్వారా అవగాహన  కల్పించడం. ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. లైవ్‌ ప్రాజెక్ట్‌లతో ఈ కార్యక్రమం ముగించడం వల్ల విద్యార్థులు పరిశ్రమ అవసరాలను తీర్చే రీతిలో సిద్ధంకావడంతో పాటుగా  భారతదేశంలో ప్రధానమైన కెరీర్‌ అవకాశాల కోసం డెవ్‌-ఇంజినీరింగ్‌ కమ్యూనిటీలలో  చేరడానికి వీలు కల్పిస్తుంది. ఇంజినీరింగ్‌ కాలేజీల దృశ్యమాన్యతను పెంచుకునే అవకాశం ఇది అందించడంతో పాటుగా పరిశ్రమకు సిద్ధమైన వెబ్‌ 3.0 కోసం నాణ్యమైన ప్రతిభావంతులను సృష్టించడం ద్వారా తమ బ్రాండ్లను నిర్మించుకునే అవకాశమూ అందిస్తుంది. ఇది అంతర్జాతీయంగా బ్లాక్‌చైన్‌ మరియు వెబ్‌ 3 కంపెనీలు తమ సంస్ధలలో నియామకాలు చేసుకునేందుకు  ఆసక్తికలిగిస్తుంది.
 
ఈ దిశగా, ఐబీసీ ఇప్పుడు ఆల్ట్‌ హ్యాక్‌ను నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో మూడు నగరాలలో  జరిగే హ్యాక్‌ ఫెస్ట్‌.దీనిలో గణణీయంగా ఒక కోటి రూపాయల వరకూ బహుమతి మొత్తం అందిస్తారు.ఈ సిరీస్‌లో మొదటగా –ఐబీసీ హ్యాక్‌ ఫెస్ట్‌  హైదరాబాద్‌ను నవంబర్‌ 22న టెక్‌ మహీంద్రా వద్ద ప్రారంభించారు. దీనిని అనుసరించి ఎనిమిది రోజుల  హ్యాక్‌థాన్‌ జరుగుతుంది. దీనిలో భాగంగా శిక్షణ, మేధోమధనం , మెంటార్‌ ఆధారిత స్పీడ్‌ బిల్డింగ్‌ సెషన్స్‌  జరిగి డెమోడేతో ముగుస్తాయి. ఐబీసీ హ్యాకథాన్‌ ఇప్పుడు పార్టిస్పెంట్స్‌కు  అంతర్జాతీయ వెబ్‌  3.0 కంపెనీలు తీర్చిదిద్దిన  అనుకూలీకరించిన కోర్సులను అందిస్తుంది. ఇది ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌కు దోహదపడుతుంది.
 
హ్యాకథాన్‌ రౌండ్స్‌ మరియు తేదీలు
 
హైదరాబాద్‌ వద్ద జరిగే రౌండ్స్‌ - నవంబర్‌ 22 నుంచి నవంబర్‌ 29 ,2022
 
విశాఖపట్నం వద్ద జరిగే రౌండ్స్- డిసెంబర్‌ 10 నుంచి 18, 2022
 
బెంగళూరు వద్ద జరిగే రౌండ్స్- జనవరి 2023 మొదటి వారం