సిద్స్ ఫార్మ్‌తో డెయిరీ ఫార్మింగ్‌ను ఆస్వాదించిన చిన్నారులు
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుప్రసిద్ధ డీ2సీ డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్, చేవెళ్లలోని తమ ఫార్మ్ వద్ద చిన్నారులకు డెయిరీ ఫార్మింగ్ పట్ల ఓ అవగహన కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 70 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా డెయిరీ ఫార్మింగ్‌లో కీలకాంశాలను గురించి తెలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా డెయిరీ ఫార్మ్‌కు వచ్చిన చిన్నారులు పూర్తి ఉత్సాహం, ఆసక్తితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. సిద్స్ ఫార్మ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి వ్యక్తిగతంగా ఈ చిన్నారులను కలుసుకోవడంతో పాటుగా క్యాంపస్ మొత్తం చూపించి, డెయిరీ ఫార్మింగ్‌లో ఉన్న లాభనష్టాలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా సిద్స్ ఫార్మ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ, చిన్నారులతో మమేకం కావడం అద్వితీయమైన అనుభవాలను మిగిల్చింది. ఫార్మ్‌లో పలు కార్యక్రమాలలో వారు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా తెలివైన ప్రశ్నలనూ సంధించారు. పాల పరీక్షలు మొదలుకుని పాలలో కల్తీ, యాంటీబయాటిక్స్ తొలిగింపుకు అనుసరించే మార్గాలను గురించి వారు అడిగి తెలుసుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఇతర పాలతో పోలిస్తే సిద్స్ ఫార్మ్ పాలు ఎందుకు విభిన్నమని వారు తెలుసుకున్న తీరు అమోఘం అని అన్నారు
హైదరాబాద్ వాల్ర్డోఫ్ స్కూల్, శ్లోకకు చెందిన విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 2016లో ప్రారంభమైన సిద్స్ ఫార్మ్ తమ కుటుంబాలు, కమ్యూనిటీలకు తాజా ఆవు, గేదె పాలతో పాటుగా పాల ఉత్పత్తులను సైతం యాంటీబయాటిక్స్, నిల్వకారకాలు లేదా సింథ టిక్ హార్మోన్లు లేకుండా అందిస్తుంది. భావి తరానికి కల్తీ లేని పాల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా మనం వినియోగించే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పాలతో మనకు లభించే ప్రయోజనాలు తెలిపేందుకు ఈ తరహా కార్యక్రమాలను సిద్స్ ఫార్మ్ నిర్వహిస్తుంది.