శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (18:38 IST)

కుటుంబ కలహాలు.. భార్యాపిల్లల్ని హత్య చేసి.. ఆపై వ్యక్తి బలవన్మరణం

suicide
ఓ వ్యక్తి తన భార్యాపిల్లలను హత్య చేసి, అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నాగరాజు అనే వ్యక్తి పాత ఇనుప సామాగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలతో తన భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా వాళ్ల మధ్య గొడవ జరిగింది.
 
ఈ క్రమంలో అదే రాత్రి భార్యతో పాటు కుమారుడు సిద్ధార్థ, కుమార్తె రమ్యశ్రీలపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నాగరాజు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా తలుపులు మూసి ఉండటం.. ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించారు.
 
ఈ నేపథ్యంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. ఆ కుటుంబమంతా విగత జీవులుగా పడివున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.