బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 నవంబరు 2022 (19:36 IST)

భారతదేశంలో తొలిసారిగా గేర్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌బైక్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ రైడింగ్‌ విడుదల చేసిన మ్యాటర్‌

motor bike
టెక్నాలజీ స్టార్టప్‌ మ్యాటర్‌ నేడు భారతదేశంలో మొట్టమొదటి గేర్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌బైక్‌ను విడుదల చేసింది. భారతదేశపు 15 మిలియర్‌ మోటర్‌బైక్‌ మార్కెట్‌ను హరిత, అనుసంధానితమైన అత్యంత అందమైన భవిష్యత్‌ దిశగా తీసుకువెళ్లే రీతిలో భావితరపు సాంకేతికతను ఇది కలిగి ఉంది. ట్రయల్స్‌ మరియు రహదారుల కోసం ఖచ్చితంగా తీర్చిదిద్దబడిన ఈ మోటర్‌బైక్‌ను డిజైన్‌ మొదలు తయారీ వరకూ పూర్తిగా కంపెనీలోనే తయారుచేశారు. ఈ వినియోగదారుల లక్ష్యిత ఉత్పత్తి ప్రధానంగా భద్రత, విశ్వసనీయత, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ వాహనాన్ని అహ్మదాబాద్‌లోని సంస్థ ఫెసిలిటీలో తయారుచేశారు. భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇది లభిస్తుంది.
 
మ్యాటర్‌ ఫౌండర్‌ మరియు సీఈఒ మోహల్‌ లాల్‌భాయ్‌ మాట్లాడుతూ ‘‘అరుణ్‌ ప్రసాద్‌, శరణ్‌ మరియు మ్యాటర్‌లోని  300 మంది ఇన్నోవేటర్లకు ఇది భారీ మైలురాయిగా నిలుస్తుంది. మొట్టమొదటిసారనతగ్గ ఎన్నో ఫీచర్లు కలిగిన ఈ మోటర్‌ బైక్‌, మేమంతా కలలుగనే భవిష్యత్‌ దిశగా మమ్మల్ని తీసుకువెళ్లగలదని గర్వంగా చెప్పగలను. మా లక్ష్యమే మాకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా యథాతథ స్ధితిని సవాల్‌ చేసేలా చేసింది. కఠినమైన మార్గములోనూ స్థిరంగా ఉండటానికి, చురుగ్గా ముందుకు సాగటానికీ మమ్మల్ని ప్రేరేపించింది. నేడు, మోటర్‌బైక్‌లపై ఇండియా ప్రయాణిస్తోన్న వేళ భారతదేశపు విద్యుతీకరణ ప్రయాణాన్ని మేము వేగవంతం చేస్తున్నాము’’ అని అన్నారు.
 
పవర్‌ ప్యాక్‌
ఈ మోటర్‌బైక్‌లో ఇంటిగ్రేటెడ్‌, హై-ఎనర్జీ డెన్సిటీ, 5కిలోవాట్‌ హవర్‌ పవర్‌ ప్యాక్‌, మ్యాటర్‌ ఎనర్జీ1.0 తో శక్తివంతమైంది. ఈ పవర్‌ప్యాక్‌ను అంతర్గతంగా, భారతీయ వాతావరణ, వినియోగపరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ యూనిట్‌లో  బ్యాటరీ ప్యాక్‌, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (బీఎంసీ), డ్రైవ్‌ ట్రైన్‌ యూనిట్‌ (డీటీయు), పవర్‌కన్వర్షన్‌ మాడ్యుల్స్‌ మరియు ఇతర ప్రొటెక్షన్‌ వ్యవస్ధలు ఉంటాయి.
 
ఈ ప్యాక్‌లో పలు పేటెంటెడ్‌ టెక్నాలజీస్‌ భాగంగా ఉంటాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్‌ ఇంటిలిజెంట్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐఐటీఎంఎస్‌) ఉంది. ఇది విప్లవాత్మక యాక్టివ్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సాంకేతికతను కలిగి ఉంది. ఇది ప్యాక్‌ యొక్క అన్ని భాగాలకూ మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు తోడ్పడుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి లిక్విడ్‌ కూల్డ్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహన బ్యాటరీ ప్యాక్‌గా నిలుస్తుంది. ప్యాక్‌పై ఉన్న సూపర్‌ స్మార్ట్‌ బీఎంఎస్‌ స్ధిరంగా పర్యవేక్షించడంతో పాటుగా సామర్థ్యం, భద్రత, విశ్వసనీయత కోసం సిస్టమ్‌ను ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఈ పవర్‌ ప్యాక్‌లో కీలక మైన ప్రాంతాలలో  బహుళ సెన్సార్లు ఉన్నాయి. ఇది ఉష్ణోగ్రత, కరెంట్‌, వోల్టేజీ వంటి లక్షణాలను సైతం పర్యవేక్షిస్తుంది. తద్వారా కోరుకున్న ఆపరేటింగ్‌ రేంజ్‌లో మొత్తం వ్యవస్ధ పనిచేసేందుకు తోడ్పడుతుంది.
 
డ్రైవ్‌ట్రైన్‌
అత్యున్నత నాణ్యత,  మృదువైన, పూర్తిగా స్పందించే సవారీ సాధ్యం చేయడానికి మ్యాటర్‌ ఇప్పుడు మ్యాటర్‌ 1.0 అభివృద్ది చేసింది. ఇది విప్లవాత్మక ప్రొపల్షన్‌ వ్యవస్ధ. ఇది ఎలక్ట్రిక్‌ మోటర్‌ను మ్యాటర్‌ హైపర్‌షిప్ట్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మిళితం చేస్తుంది. ఇది రైడర్‌కు పవర్‌ డెలివరీపై పూర్తి నియంత్రణ అందిస్తుంది. దీనిలోని 10.5 కిలోవాట్‌ విద్యుత్‌ మోటర్‌ను ప్రొప్రైయిటరీ సీక్వెన్షియల్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ తో జత కలుపుతుంది. ఇది డ్రైవ్‌ట్రైన్‌ యొక్క పెర్‌ఫార్మెన్స్‌ శ్రేణిని విస్తరించడంతో  పాటుగా స్ధిరంగా పవర్‌డెలివరీ, ఫ్లాట్‌ టార్క్‌, మరే ఇతర వాహనమూ అందించనటువంటి సామర్థ్యం అందిస్తుంది.
 
పేటెంటెడ్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సాంకేతికత ఒకే సమయంలో రోటర్‌ మరియు స్టాటర్‌ను కూల్‌ చేయడంతో పాటుగా ఎలక్ట్రిక్‌ మోటర్‌ నుంచి వేగంగా వేడిని ఉపసంహరిస్తుంది. ఆఖరకు వాహనం అసలు కదలనప్పుడు కూడా దీనిని సాధ్యం చేస్తుంది. ఈ డ్రైవ్‌ట్రైన్‌ను విస్తృత శ్రేణిలో పరిశోధించడంతో పాటుగా మ్యాటర్‌ యొక్క అత్యాధునిక ఫెసిలిటీ వద్ద వాలిడేట్‌ చేశారు. తద్వారా ఇది మారుతున్న కఠినమైన, పనితీరు భద్రతా ప్రమాణాలు అయిన ఏఐఎస్‌ 041 మరియు ఐపీ65 ను అందుకుంటాయి. అదే సమయంలో అసాధారణ పనితీరు అవసరాలనూ అందుకునే సామర్ధ్యం ఉంది.
 
చార్జింగ్‌ వ్యవస్ధలు
ఈ మోటర్‌బైక్‌ ప్రామాణిక, వేగవంతమైన చార్జింగ్‌కు కామన్‌ కనెక్టర్‌ ద్వారా మద్దతు అందిస్తుంది. ఈ వాహనంలో 1కిలోవాట్‌ ఇంటిలిజెంట్‌ చార్జర్‌, మ్యాటర్‌ చార్జ్‌ 1.0 ఉంది. ఇది వాహన చార్జింగ్‌ సౌకర్యం పరంగా అత్యంత అనుకూలమైన సౌలభ్యంను ఏదైనా 5యాంప్‌, 3 పిన్‌ ప్లగ్‌ పాయింట్‌ వద్ద అందిస్తుంది. ఈ ఆన్‌బోర్డ్‌ చార్జర్‌ తో 5 గంటల లోపుగానే వాహనాన్ని చార్జ్‌ చేయవచ్చు. దీనిలో ఓవర్‌చార్జ్‌ ప్రొటెక్షన్‌ సైతం ఉంది.
 
డిజైన్‌
ఈ మోటర్‌బైక్‌ను భావోద్వేగాలను ప్రేరేపించేలా రూపొందించబడింది. ఇది ఒక పరిమాణాత్మకమైన, ఇంకా సొగసైన సిల్హౌట్‌తో నిర్వచించబడింది. చక్కగా తీర్చిదిద్దన ఉపరితలాలు, విభిన్నంగా తీర్చిదిద్దిన  ఇంజినీరింగ్‌ భాగాలు మరియు విస్మయ పరిచే వివరాలతో విలక్షణంగా ఉంటుంది. ఈ మోటర్‌సైకిల్‌  విజువల్‌ అప్పీల్‌తో పాటుగా ఊహాతీత వివరాలలో అత్యంత స్పష్టంగా ఈ మోటర్‌ బైక్‌ తయారీ ఆలోచన మొత్తం కనిపిస్తుంది. బై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, స్ల్పిట్‌ ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌, బాడీ ఇంటిగ్రేటెడ్‌ ఫంట్‌ టర్న్‌ సిగ్నల్స్‌, ట్రాన్లుసెంట్‌ ష్రౌడ్‌, మోటర్‌కు జోడించబడిన ఎక్స్‌పోజ్డ్‌ స్పిన్నర్‌ వంటివి మ్యాటర్‌ యొక్క మోటర్‌బైక్‌ కోసం ప్రగతిశీల  డిజైన్‌ భాషను కలిగి మంత్రముగ్థులను చేస్తుంది. ఈ వాహనంలో  సౌకర్యవంతమైన యుటిలిటీ అంశాలైనటువంటి  బిల్ట్‌ ఇన్‌ లైట్స్‌ మరియు స్మార్ట్‌ మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌తో  5 లీటర్ల స్టోరేజీ స్పేస్‌తో కలిగి ఉంది.
 
అనుసంధానిత అనుభవాలు
ఈ మోటర్‌బైక్‌ను రైడర్‌తో పూర్తిగా అనుసంధానించబడే రీతిలో తీర్చిదిద్దారు. టచ్‌ ఆధారిత 7 అంగుళాల వాహన ఇన్‌స్ట్రుమెంట్‌క్టస్టర్‌ (వీఐసీ), అత్యాధునిక ప్రాసెసర్‌ శక్తివంతంగా ఉంటుంది.  దీనిలో 4జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ కలిగి సహజసిద్ధమైన యుఐతో నడుస్తుంది. ఇది రైడర్‌కు కావాల్సిన సమాచారమంతా అంటే వేగం, గేర్‌ పొజిషన్‌, రైడింగ్‌ మోడ్‌, నేవిగేషన్‌, మీడియా,కాల్‌ కంట్రోల్‌ మరియు ఇతర ఫీచర్లు అంటే గతంలో  మోటర్‌బైక్‌లో  ఎన్నడూ చూడని ఫీచర్లను అందిస్తుంది. దీనిలోని కనెక్టడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌  అత్యంత సౌకర్యవంతంగా వాహన కంట్రోల్స్‌ అయిన రిమోట్‌లాక్‌/అన్‌లాక్‌, జియోఫెన్సింగ్‌, లైవ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌, వాహన ఆరోగ్య పర్యవేక్షణను అందిస్తుంది. అంతేకాకుండా రైడర్‌కు వ్యక్తిగతీకరించిన రైడ్‌ స్టాటిస్టిక్స్‌, చార్జింగ్‌  స్టాటస్‌, పుష్‌ నేవిగేషన్‌ మరియు మరెన్నో అందిస్తాయి. ప్రాక్సిమిటీ ఆధారిత కీ ఫోబ్‌ మరియు పాసివ్‌ కీ లెస్‌ ఎంట్రీ సిస్టమ్‌ , రైడర్‌ వాహనాన్ని సమీపించడం ద్వారా వాహనాన్ని లాక్‌/అన్‌లాక్‌ చేయడానికి అనుమతిస్తుంది. ఇది అసలైన కీ లెస్‌ అనుభవాలను అందిస్తుంది.
 
భారతదేశంలోని విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో సైతం సౌకర్యవంతంగా పనిచేసేలా ఈ మోటర్‌బైక్‌ను మ్యాటర్‌ రూపొందించింది. ఈ మోటర్‌బైక్‌ నిర్వహణ ఉష్ణోగ్రత –10డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 55 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉంది. ఏ విధంగానూ భద్రత పరంగా ఈ బైక్‌ రాజీపడదు. ముందు మరియు వెనుక చక్రాలు  డిస్క్‌ బ్రేక్స్‌ను ఏబీఎస్‌తో కలిగి ఉండటంతో పాటుగా భారీ టైర్లు సురక్షిత బ్రేకింగ్‌కు మద్దతు అందిస్తాయి. దీనితో పాటుగా గొప్ప ట్రాక్షన్‌, రోడ్‌ గ్రిప్‌ను అందిస్తుంది. పేటెంట్‌ పొందిన డ్యూయల్‌ క్రాడెల్‌ ఫ్రేమ్‌ ఈ అంశాలన్నింటినీ వినూత్నమైన ప్యాకేజింగ్‌లో తీసుకురావడంతో పాటుగా వాహన స్థిరత్వం, రైడింగ్‌ డైనమిక్స్‌, కార్నరింగ్‌ పనితీరు మరియు  అత్యుత్తమ శ్రేణి అనుభవాలను అందిస్తుంది.