వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటది?
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వీడియో కాల్ చేస్తూనే ఇతర యాప్స్‌ను చూడొచ్చు. వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లలో చాటింగ్ కూడా చేసుకోవచ్చు.
ఈ మేరకు ఐవోఎస్ (యాపిల్) యూజర్ల కోసం వాట్సాప్ ఐవోఎస్ బీటా వెర్షన్‌ను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంస్థ విడుదల చేసింది. ఐవోఎస్ 16.1, అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్ ఆపరేటింగ్ సిస్టం వినియోగించే ఫోన్లలోనే ఈ ఫీచర్ పని చేస్తుందని తెలిపింది. అయితే, ఇతర ఫోన్లలో త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని మెటా ప్రకటించింది.