1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (10:54 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఒకే నెంబర్‌పై రెండు సేవలు

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చేసింది. ఒకే నెంబర్‌పై రెండు మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. బీటా టెస్టర్లు ప్రస్తుతం పరీక్షించే పనిలో వున్నారు. వాట్సాప్‌లో ప్రస్తుతం లింక్డ్ డివైజెస్ ఫీచర్ అందుబాటులో వున్న సంగతి విదితమే. 
 
దీని ద్వారా కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ఇలా మొబైల్ ఫోన్‌కు అదనంగా, నాలుగు ఇతర డివైజెస్‌లోనూ ఒకే వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
త్వరలోనే ఒకే నెంబర్‌పై రెండు మొబైల్స్‌లో వాట్సాప్ లాగిన్‌కు అవకాశం కల్పించనుంది. అలాగే ఖాతాపై ఎన్ని డివైజెస్‌లో వాట్సాప్ లాగిన్ అయి ఉంది. మిస్డ్ కాల్స్ సేవలను కూడా వాట్సాప్ తీసుకువస్తోంది.