వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... ప్రైవసీకి మరింత భరోసాగా..
డిజిటల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ప్రైవసీకి హాని కలుగకుండా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. సాధారణంగా ఒక్కసారి డెస్క్‌టాప్‌పై లాగిన్ అయితే, మళ్లీ లాగౌట్ చేసేంత వరకు అది ఓపెన్‌లోనే ఉంటుంది. వాట్సాప్ వినియోగదారులు లాగౌట్ కొట్టకపోతే వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. దీనికి చెక్ పెట్టేలా ఇపుడు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా యాజమాన్యం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఇకనుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ లాక్ తీయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ విధిగా ఎంటర్ చేయాల్సివుంటుంది. యాజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు మెటా సంస్థ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుందని పేర్కొంది.