1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (10:26 IST)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురి మృతి

road accident
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ బోల్తాపడటంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. జిల్లాలోని పూతలపట్టు వావిళ్లతోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం మేరకు ఒక వివాహ వేడుకకు అనేక మంది ట్రాక్టర్‌లో వెళుతుండగా, ఇది అదుపుతప్పి బోల్తా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు మృతి చెందారు.
 
ప్రమాదానికి అతి వేగమే కారణమని చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు ట్రాక్టర్‌లో 22 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.