సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చిత్తూరు జిల్లాలో 10 సెకన్ల పాటు కంపించిన భూమి.. ప్రజలు పరుగో పరుగు

earthquake
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. పది సెకన్ల పాటు ఇవి కనిపించడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. మొత్తం 15 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూ ప్రపంకపనలు కనిపించాయి. 
 
ముఖ్యంగా, గంటపూరు, పలమనేరు, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కనిపించింది. 
 
గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు కనిపించిన విషయం తెల్సిందే. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే, ఈ సారి మాత్రం ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదు.