శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (16:15 IST)

సూర్యాపేటలో మైనర్ బాలికపై అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన తిరుమలగిరిలో జరిగింది. ఇది బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దసరా పండుగ రోజున ఈ బాలికపై అత్యాచారం జరిగింది. 
 
ఆ తర్వాత ఆ బాలికను హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. దీంతో ఈ అత్యాచార ఘటన వివరాల బయటకు వచ్చాయి. 
 
నెల రోజుల పాటు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు షోరూమ్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు తిరుమలగిరి పోలీసులు హైదరాబాద్ నగరానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.