సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (15:30 IST)

మిరాకిల్... బాలిక కంట్లో నుంచి బియ్యం.. రాళ్లు

rice in eye
సాధారణంగా ఒక మనిషి ఏడిస్తే కళ్లలో నుంచి కన్నీరు వస్తాయి. కానీ, ఆ బాలిక ఏడిస్తే మాత్రం బియ్యం, రాళ్లు వస్తున్నాయి. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు దీపాలి కళ్లలోనుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ చిన్నారి నొప్పితో బాధపడుతుంది. 
 
దీంతో ఆ బాలికను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు స్కానింగ్ పరీక్షలు చేసినా ఏం లేదని తేల్చారు. కానీ, ఆ బాలిక కంటిలో నుంచి రోజుకు కనీసం పది నుంచి 12 వరకు చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది కాస్త వింత వినిపించినా ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పింతో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకా దీపాలి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు.