శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (21:07 IST)

వైట్ రైస్ తీసుకుంటున్నారా.. కాస్త మారండి.. లేకుంటే..? (వీడియో)

Ghee Rice
ప్రతిరోజూ వైట్ తీసుకుంటున్నారా.. కాస్త మారాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనంలో వైట్ రైస్ ఆరోగ్యానికి హానికరమని తేలింది. వైట్ రైస్ తో గుండె జబ్బులు వచ్చే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి రైస్ నష్టం కలిగిస్తుందే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం అందించదు.
 
అందుకే వ్యక్తి బరువు తగ్గాలనుకుంటే అన్నం తినకూడదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బియ్యంలో ఉండే కార్బో హైడ్రేట్స్ బరువు పెంచడంలో సహాయపడుతుంది. 
 
2,500 మందిపై చేసిన అధ్యయనంలో వైట్ రైస్ మిఠాయిలో ఉండే చక్కెరతో సమానమని వివరించారు. తెల్ల బియ్యం స్థానంలో ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
అధిక మొత్తంలో శుద్ధి చేసిన ధాన్యాలతో తయారైన ఆహారాన్ని తీసుకున్న వ్యక్తులు రక్తంలో చక్కెర పెరుగుదల, బరువు పెరగడం, గుండె సమస్యలు బయటపడ్డాయి. ఇవి మున్ముందు రక్తపోటు పెరుగుదలతో పాటు రక్త నాళాలను దెబ్బ తీస్తున్నట్లు గుర్తించారు.  
 
వైట్ రైస్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే గోధుమ రంగులో ఉండే బియ్యాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సమస్యలు ఉండవన్నారు. ధూమపానం, ఆల్కహాల్, రిఫైన్డ్ షుగర్ లేదా జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు.