బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (16:10 IST)

వర్షాకాలంలో బచ్చలి కూర సూప్.. ఆరోగ్యానికి మేలెంత?

Spinach
వర్షాకాలంలో బచ్చలి కూర సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బచ్చలి కూరతో సూప్ చేసుకొని తీసుకుంటే..  రుతు సమస్యలు తొలగించుకోవచ్చు. గర్భిణీలు బచ్చలి ఆకులతో తయారు చేసిన సూప్ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు గర్భస్రావాన్ని కూడా నిరోధించవచ్చు. 
 
ముఖ్యంగా బచ్చలిలో ఉండే ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. బచ్చలి కూరలో ప్రోటీన్లు అత్యధికంగా వుంటాయి. ఇందులో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా కనిపిస్తాయి. 
 
కాబట్టి ఎముకల బలహీనత, దంతాల సమస్యలు దూరం చేసుకోవచ్చు. కంటి వ్యాధులను అదుపు చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.