శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:25 IST)

బ్లాక్ బ్రౌన్ రైస్ తింటే.. మధుమేహం కాదు... బరువు కూడా తగ్గొచ్చు.. (video)

black Rice
బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ బ్రౌన్ రైస్ (నల్లబియ్యం) అత్యంత ఆరోగ్యకరమైన బియ్యంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యకరమైన బియ్యం జాబితాలో బ్లాక్ బ్రౌన్ రైస్ మొదటి స్థానంలో ఉంది. బ్లాక్ బ్రౌన్ రైస్ సహజంగా రిచ్ డిటాక్సిఫైయింగ్ ఫుడ్. 
 
ఈ బ్లాక్ రైస్‌లోని పోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి,  హానికరమైన టాక్సిన్స్ నుండి కాలేయాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ బ్లాక్ బ్రౌన్ రైస్ తినడం వల్ల ధమనులలో కొవ్వు నిల్వలను తగ్గించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 
తెల్లబియ్యం స్థానంలో ఇతర రకాల బియ్యాన్ని వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలా చేస్తే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. బ్లాక్ బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులను ఇవి దూరం చేస్తాయి. 
 
బ్లాక్ బ్రౌన్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణసమస్యలకు చెక్ పెడుతుంది. మధుమేహం ఉన్నవారికి వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయంగా, బ్లాక్ బ్రౌన్ రైస్ రోజూ తీసుకుంటే మధుమేహంతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 
బొద్దుగా ఉండే శరీరాన్ని తగ్గించుకోవడానికి ఈ బ్లాక్ రైస్ అద్భుతమైన ఆహారం. బరువు తగ్గాలనుకునే వారు ఈ బియ్యాన్ని ఉడికించుకుని తినడం చేయొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.