శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (16:04 IST)

గుండెకు బలాన్నిచ్చే ముల్లంగి ఆకు..

radish
ముల్లంగితో పాటు ఆకులు, కాండం, గింజల్లో పుష్కలమైన ఔషధ గుణాలు వున్నాయి. ముల్లంగి, బచ్చలికూర మధుమేహానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ముల్లంగి ఆకు వివిధ రుగ్మతలను నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు గుండెకు బలాన్నిస్తాయి. 
 
అలాగే గుండె జబ్బులు, గుండె దడ, గుండె బలహీనతతో బాధపడేవారు కనీసం వారానికోసారైనా ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ముల్లంగిని ఆహారంతో పాటు తరచుగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ లోపాలు కూడా తొలగిపోతాయి. మూత్రం సరిగా రాని వారు ఒక చెంచా బార్లీని ముల్లంగితో మరిగించి తింటే వాటర్ బ్లాక్ తొలగిపోయి మూత్ర సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.