నిమ్మ ఆకుల టీ తాగారా? మేలు తెలిస్తే వదులుకోరు.. (Video)
నిమ్మకాయలతో కాదు.. నిమ్మ ఆకులతోనూ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి తలనొప్పిని దూరం చేస్తాయి. ఊబకాయానికి చెక్ పెడుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నిమ్మ ఆకులతో తయారు చేసిన టీని సేవిస్తే మంచి ఫలితం వుంటుంది.
పిల్లలకు ఓ స్పూన్ మోతాదులో నిమ్మఆకుల టీని ఇవ్వడం ద్వారా నులిపురుగులు చేరవు. ఈ టీ గొంతునొప్పి, ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. నిమ్మ ఆకుల్లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1 తగినంత పరిమాణంలో లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
నిద్ర సంబంధిత సమస్యలను అధిగమించడానికి నిమ్మ ఆకులతో తయారుచేసిన టీ తీసుకోవడం మంచిది. నిమ్మ ఆకులతో తయారైన టీలో విటమిన్ సి, విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.