సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (19:39 IST)

చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదాలా?

ఓర్పుతో వుండాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పుకే విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను టీచర్ చితకబాదింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. టీచర్ రాజ్యలక్ష్మి చెప్పులకు మట్టిందని ఆరుగురు విద్యార్థులను కర్రతో గొడ్డును బాదినట్లు బాదింది. దీంతో విద్యార్థులకు గాయాలైనాయి. మానకొండూరు గ్రామంలో వర్షాల కారణంగా బురదమయం అయ్యింది. దీంతో విద్యార్థులు బురదలోనే నడవాల్సిన పరిస్థితి. 
 
ఇలా చెప్పులకు బురద అంటుకుంటోంది. దీన్ని చూసిన టీచర్ వారిపై విచక్షణా రహితంగా ప్రవర్తించింది.  కర్ర తీసుకుని విద్యార్థులను చితకబాదింది. విద్యార్థులను అకారణంగా చితకబాదిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హెచ్ఎంను డిమాండ్ చేస్తున్నారు.