బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (15:56 IST)

అందరిముందూ దుస్తులు విప్పించిన టీచర్.. ఒంటికి నిప్పంటించుకుని..?

జార్ఖండ్, జంషెడ్‌పూర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తరగతి గదిలో అందరిముందూ టీచర్ దుస్తులు విప్పించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యార్థిని కాపీ కొడుతోందని ఇన్విజిలేటర్ భావించింది. దీంతో చిట్టీలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆమె దుస్తుల్ని విప్పించి, తనిఖీ చేసింది.

అయితే ఈ తనిఖీ అందరిముందూ చేయడంతో యువతి అవమానానికి గురైంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు బాలిక ఒంటిపై మంటలు ఆర్పేసి, ఆస్పత్రికి తరలించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై బాలిక నుంచి వాంగ్మూలం సేకరించారు. ప్రస్తుతం బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.