బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (22:07 IST)

టీచర్ అవతారం ఎత్తిన వైసీపీ నేత.. చాక్ పీస్‌తో బోర్డుపై రాస్తూ..?

chevi Reddy
chevi Reddy
వైసీపీ కీల‌క నేత‌, తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి టీచర్ అవతారం ఎత్తారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే ప‌లు స‌బ్జెక్టులలో మాస్ట‌ర్స్ డిగ్రీలు అందుకున్న చెవిరెడ్డి... న్యాయశాస్త్రాన్ని కూడా చ‌దివారు. వృత్తిరీత్యా రాజ‌కీయ నేత‌గా ఉన్నా... విద్యాభ్యాసంలో మాత్రం చెవిరెడ్డికి ఇప్ప‌టికీ తృష్ణ తీర‌లేద‌నే చెప్పాలి.  
 
తాజాగా శుక్ర‌వారం చెవిరెడ్డి ఉపాధ్యాయుడి అవ‌తారం ఎత్తారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పాకాల మండ‌లం  రమణయ్యగారి పల్లి గ్రామం వెళ్లిన చెవిరెడ్డి, గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఓ త‌ర‌గతి గ‌దికి వెళ్లిన చెవిరెడ్డి అక్క‌డి విద్యార్థుల‌కు పాఠాలు చెప్పారు.