నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగితే...
చాలా మందికి బెడ్ కాఫీ అలవాటు ఉంటుంది. ఇంకొందరు టీ సేవిస్తుంటారు. నిద్రలేవగానే లేదా బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ సిప్ చేయకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. లేవగానే కాఫీ లేదా టీ తాగడం వల్ల ఛాతిలో మంట, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
అయితే, నిద్ర లేవగానే, పరగడపన టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా జరిగిన పరిశోదనల్లో వెల్లడైంది. ముఖ్యంగా, పరగడుపునే టీ, కాఫీ తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయని, అలాగే కడపు, ఛాతి బరువుగా అనిపిస్తుందని వైద్యులు చెపుతున్నారు.
ఉదయాన్ని నిద్ర లేవగానే, టీ, కాఫీ తాగడం కంటే గోరు వెచ్చని నీరు తాగడం ఎంతో మంచిదని అభిప్రాయపడుతున్నారు. పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరమైందని గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఉదయాన్నే ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.