మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:06 IST)

కన్నతల్లిపై ఫిర్యాదు చేసిన మూడేళ్ళ బుడతడు

kid
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడేళ్ళ బుడతడు ఒకడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనే ఇపుడు వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
తన మిఠాయిలను దొంగిలించినందుకు తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని తన తండ్రిని నిరంతరం బలవంతం చేయడంతో బాలుడి తండ్రి అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హంపూర్‌లో చోటుచేసుకుంది.
 
ఆ బాలుడు కాండీని (కాజల్‌)ని దొంగిలించాడు. దీంతో తల్లి కోప్పడి చెంపపై కొట్టి, కసురుకుందని బాలుడు తండ్రి చెప్పాడు. తర్వాత తనను తీసుని స్టేషన్‌కు వచ్చి పోలీసులకు చేశాడని, కంప్లైట్ పేపర్‌పై సంతకం కూడా చేశాడని తెలిపారు. ఈ వీడియోలో, బాలుడు ఒక కాగితంపై సంతకం చేయడం చూశాడు, దానిపై మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదును నమోదు చేసినట్లు నటించారు.